![]() |
![]() |

బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ 'ప్రేమ ఎంత మధురం'. థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన ఈ సీరియల్ గత కొన్ని వారాలుగా వరుస ట్విస్ట్ లతో ఆకట్టుకుంటూ చివరి అంకానికి చేరుకుంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా మొదలైన ఈ సీరియల్ క్లైమాక్స్ కి చేరుకుంది. ఓ ఆత్మ పగ, ప్రతీకారం నేపథ్యంలో ఈ సీరియల్ ని రూపొందించారు. 'బొమ్మరిల్లు' ఫేమ్ శ్రీరామ్ వెంకట్ నటించి నిర్మించారు. వర్ష హెచ్.కె., జయలలిత, రామ్ జగన్, విశ్వమోహన్, రాధాకృష్ణ, జ్యోతిరెడ్డి, బెంగుళూరు పద్మ, అనుషా సంతోష్, కరణ్, మధుశ్రీ, ఉమాదేవి, సందీప్ ఇతర పాత్రల్లో నటించారు.
రాగసుధ పన్నిన కుట్రకు తను కూడా సహాయం చేశానంటూ రఘుపతి పశ్చాతాప పడతాడు. ఆమె కుట్ర అంతా తెలుసని, సాక్ష్యం చెప్పి తన పాపానికి ప్రాయశ్చితం చేసుకుంటానని రఘుపతి తన సైగలతో అను తండ్రి సుబ్బుకు చెబుతాడు. ఇదే విషయాన్ని సుబ్బు.. అనుకు ఫోన్ లో వివరిస్తాడు. అయితే ఆ మాటలు విన్న ఆర్యవర్ధన్ అతని సాక్ష్యం చెల్లదని, రాగసుధ దాన్ని మరింత అడ్వాంటేజీగా తీసుకుంటుందని చెబుతాడు. మరి రాగసుధను అడ్డుకోవడం ఎలా? అని అను, జెండేలు అనడంతో మన దగ్గర ఒరిజినల్ ఆస్తిపత్రాలు వున్నాయంటాడు.
రాజనందిని గదిలో వున్న ఆ పత్రాలని తీసుకుని మీరు కోర్టుకు ఏ కారులో వెళుతున్నారో రాగసుధకు తెలియకుండా జాగ్రత్తపడమని, ఆ బాధ్యత నీదని జెండేకు చెప్పడంతో ఆస్తి డాక్యుమెంట్స్ కోసం అను, జెండే ఇంటికి వస్తారు. రాజనందిని గదిలోకి అను వెళ్లి వెతికితే ఆ డాక్యుమెంట్స్ ని ఎప్పుడో రాగసుధ కొట్టేసిందన్న విషయం అనుకు ఆలస్యంగా తెలుస్తుంది. ఆ షాక్ లో వున్న అనుని మాన్సీ, ఆమె తల్లి నిందిస్తూ వుంటారు. తనే రాగసుధకు ఆస్తి పత్రాలు ఇచ్చేసిందని నిందిస్తుంటారు. కట్ చేస్తే ఆస్తి పత్రాలతో రాగసుధ స్టైల్ గా కోర్టుకు బయలు దేరుతుంది. ఆర్యవర్ధన్ ఏం చేయబోతున్నాడు?.. రాగసుధ కుట్ర ముందు ఓడిపోతాడా? ఆస్తిని పోగొట్టుకుంటాడా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
![]() |
![]() |